టీడీపీ ఓడిపోతే ఏపీ కేసీఆర్ సామంత రాజ్యంగా మారుతుంది - చంద్రబాబు
ఐటీ గ్రిడ్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. తెలుగురాష్ట్రాల్లో రాజకీయ దుమారం తారా స్థాయికి చేరుకుంటోంది. ఈ వ్యహహారంపై ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.తాజా ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు మరో మారు స్పందిస్తూ కేసీఆర్ తీరును ఎండగట్టారు .
ఐటీ గ్రిడ్ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే డేటా దాడులకు పాల్పడుతున్నారని వియర్శించారు. టీడీపీ కోసం పని చేస్తున్న కంపెనీని దెబ్బతీసి రాజకీయంగా నష్టం చేయాలనుకుంటున్నారని..అందుకే కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వ తీరును విమర్శించారు. రిటర్న్ గిఫ్ట్ పేరు చెప్పి ఏపీని దొంగదారిన దెబ్బతీయాలని కేసీఆర్ చూస్తున్నారని .. హద్దులు మీరితే సహించేది లేదని చంద్రబాబు హితవు పలికారు.
తెలుగుదేశం పార్టీని ఒడించి ఏపీని కేసీఆర్ కు సామంత రాజ్యంగా మార్చుకోవాలని కుట్రపన్నారని విమర్శించారు. అందుకకే జగన్ గెలుపు కోసం కేసీఆర్ ప్రయత్నిసున్నారని చంద్రబాబు విమర్శించారు. తమను ఓడించేందుకు వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఏకమై కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా టీడీపీ దాన్ని సమర్ధవంతంగా తిప్పికొడుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు