AP POLITICS: రెండు దశాబ్ధాలకు పైగా రాజకీయ అనుభవం.. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పనిచేసిన రికార్డు.. అంతేకాదు.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ సేవలందించిన ఎక్స్‌పీరియన్స్.. ఇవన్నీ గతం.. ప్రస్తుతం మాత్రం ప్రమోషన్ కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. దాదాపు 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానమున్న మాజీమంత్రి కొండ్రుమురళి ఇప్పుడు మంత్రి పదవిలేక తెగ ఫీల్ అవుతున్నారట. ఐదేళ్లు జగన్ సర్కార్‌పై రాజీలేని పోరాటం చేసిన తనకు పదవి యోగం దక్కడం లేదన్న అసంతృప్తి ఆయనలో రోజురోజుకు పెరిగిపోతోందట. ఇదే విషయాన్ని అనుచరుల దగ్గర చెప్పుకోలేక.. అటు అధిష్టానం దగ్గర వెళ్లి ప్రస్తావించలేక లోలోన తెగ మదనపడిపోతున్నట్టు విజయనగరం జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో నియోజకవర్గంలో 2009 లో కొండ్రు మురళి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన రాజం ఎస్సీ నియోజకవర్గానికి బదిలీ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజాం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారం ఉండటంతో ఎస్సీ రిజర్వ్ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. అంతేకాదు సీనియర్‌గా తనకున్న అనుభవాన్ని అయినా పరిగణనలోకి లోకి తీసుకుంటారని భావించారు. కానీ మాజీమంత్రి కొండ్రు మురళికి మంత్రి యోగం దక్కలేదు. అయితే ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి..
ఇక సమైఖ్య రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. కొండ్రుమురళి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ కొలువుదీరినా.. కొండ్రుమురళికి మంత్రి పదవి దక్కలేదు. అప్పుడే ఆయనకు మంత్రి పదవి రాకపోవడంపై లోతైన చర్చ జరిగిందనే చెబుతున్నారు. కానీ ఇప్పుడు కూడా రాష్ట్రంలో మరోసారి కూటమి సర్కార్ కొలువుదీరింది. ఈ పదేళ్లలో ఆయన మంత్రి లోకేష్‌కు చాలా దగ్గరయ్యారు. మంత్రి లోకేష్ ఆశీస్సులు కొండ్రు మురళికి పుష్కలంగా ఉన్నాయని జిల్లాలో ప్రచారంముంది. అయినప్పటికీ కొండ్రుకు పదవి దక్కడం లేదు.. అయితే పదవి విషయంలో మాత్రం కొండ్రు మురళీ తీవ్ర ఆవేదన చెందుతున్నట్టు అనుచరులు చెప్పుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు కీలకంగా ఉన్నారు. అటు అచ్చెన్న అన్నకొడుకు ఎంపీ రామ్మోహన్ కేంద్రమంత్రిగానూ కొనసాగుతున్నారు. వీరి అనుమతి లేనిదే ఉత్తరాంధ్రలో రాజకీయం చేయలేని పరిస్ధితి జిల్లాలో ఉంది. కొండ్రుమురళికి మంత్రి పదవి రాకపోవడం వెనుక సిక్కోలు నేతలు ఉన్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. అయితే యువకుడిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొండ్రు మురళి.. మూడుసార్లు గెలిచారు. మంత్రిగా సేవచేసిన అనుభవం ఇప్పుడు ఏమాత్రం అక్కరకు రాకుండా పోయిందని తెగ పరేషాన్ అవుతున్నారట.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన జరగడంతో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దాంతో సిక్కోలు నుంచి విజయంనగరంలోకి వెళ్లిన పోయిన కొండ్రు మురళి అలకపాన్పు ఎక్కినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రి పదవి ఎలాగూ దక్కలేదు. కనీసం నామినేటెడ్ పోస్టుతో నైనా సరిపెట్టుకుందాం అని అనుకున్నారట. కానీ అదికూడా దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఉత్తరాంధ్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన కొండ్రు మురళీకి భవష్యత్తులోనైనా మంత్రి పదవి దక్కుతుందా.. లేదంటే వచ్చే ఐదేళ్లూ కూడా ఆయన ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతారా అనేది తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
Also read: CM Revanth Reddy: సెక్రటేరియట్‌లో మార్పులు.. కారణం ఏంటంటే..?
Also read: Viral Video: స్మిత గారు.. మీకోసమే అంటూ ఎక్స్ లో పోస్ట్... నెట్టింట రచ్చగా మారిన వీడియో.. ఏముందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.