వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఏపీ సీఎం  చంద్రబాబు స్పందించారు. ఈ కేసులో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించి తీరుతామని  పేర్కొన్నారు.  వివేకా హత్య నేపథ్యంలో  పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  ఈ భేటీలో డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారులు, కడప జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.ఈ కేసులో నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు. వివేకా కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.