Ap cm ys jagan: ఏపీ ప్రభుత్వం-ఉద్యోగుల చర్చలు సఫలమై..సమ్మె విరమణైంది. మీరు లేకపోతే నేను లేనంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులతో భావోద్వేగమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. నిన్న మంత్రుల కమిటీతో చర్చలు సఫలమైన తరువాత ఇవాళ ఉద్యోగులు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. 


ఈ సందర్భంగా ఉద్యోగుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సహకారముంటేనే ఏదైనా సాధ్యం చేయగలుగుతామని వైఎస్ జగన్ తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా..ఉద్యోగులకు చేయగలిగినంత సహకారం చేస్తున్నామని గుర్తు చేశారు. ఇక డిమాండ్ల విషయంలో ఎవరూ భావోద్వేగానికి గురి కావద్దని సూచించారు. అదే సమయంలో మీరు లేకపోతే నేను లేనంటూ సీఎం జగన్ భావోద్వేగమయ్యారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan), ఉద్యోగుల మధ్య సీపీఎస్ రద్దుపై ప్రధానంగా చర్చ జరిగింది. సీపీఎస్ విషయంలో సరైన పరిష్కారం చూపిస్తామన్నారు జగన్. సీపీఎస్ రద్దు విషయమై జరిపే అధ్యయనంలో ఉద్యోగ సంఘాల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై రోస్టర్ ప్రకారం తగిన చర్చలు తీసుకుంటామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మంత్రుల కమిటీలో తీసుకున్న నిర్ణయాలన్నీ తమ ఆమోదంతోనే చెప్పినట్టు సీఎం జగన్ చెప్పారు. ఐఆర్ ఇచ్చిన 30 నెలలకు సర్దుబాటు చేయాల్సి ఉందని..ఇప్పుడు 9 నెలలకు మినహాయించడం వల్ల ప్రభుత్వంపై 4 వేల 5 వందల కోట్ల భారం పడుతోందన్నారు. ఇక హెచ్ఆర్ఏ రూపంలో మరో 3125 కోట్ల భారం పడుతోందని తెలిపారు. అడిషనల్ క్వాంటం పెన్షన్ రూపంలో సీసీఏ రూపంలో 1330 కోట్ల భారం పడుతుండగా, రికరింగ్ కాస్ట్ రూపంలో 8 వందల కోట్ల భారం పడుతోంది. మొత్తం 11 వేల 5 వేల కోట్ల భారం పడుతున్నా..ఉద్యోగుల మేలు కోరి అంగీకరించినట్టు చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంటే..ఉద్యోగుల్ని మరింతగా సంతోషపెట్టేవాడినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు.


Also read: AP PRC Issue: చర్చల్లో ఉద్యోగ సంఘాలు సాధించిన కొత్త అంశాలు, వ్యత్యాసమేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook