విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష; నెల రోజుల్లో వీసీల నియామక ఆదేశాలు
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ విద్యాశాఖ పై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు
ఏపీ సీఎం జగన్ ఈ రోజు విద్యాశాఖ శాఖ ఉన్నాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రధానంగా విశ్వవిధ్యాలయాల ఉపకులపతుల (వీసీ) నియామక అంశం ప్రస్తావనకు వచ్చింది.
సెర్చ్ కమిటీలు ఏర్పాటు...
వీసీల నియామకం కోసం వెంటనే సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన వీసీల నియామకాలను నెల రోజుల్లోగా భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమర్థతకే పెద్దపీట వేయండి..
వీసీల ఎంపిక విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని నియామకాల్లో పారదర్శక పాటించాలన్నారు. సమర్థత, అనుభవం ఉన్నవారినే వీసీలుగా ఎంపిక చేయాలని అధికారులకు సీఎం సూచించారు. వీసీలకు నియామకంతో పాటు వర్శిటీల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.