CM Jagan Plane Emergency Landing: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం తిరిగివచ్చింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సిబ్బంది వెంటనే గుర్తించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఢిల్లీ పర్యటన నిమిత్తం సీఎం జనగ్ గన్నవరం విమానాశ్రయం నుంచి 5.03 గంటలకు బయలుదేరారు. అయితే విమానం టేకాఫ్ అయిన తరువాత కాసేటికే 5.20 నిమిషాలకు తిరిగి అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి జగన్ కాసేపు విమానాశ్రయంలోనే ఎదురుచూశారు. అయితే ఇప్పుడే పరిష్కరం అయ్యే అవకాశం కనిపించకపోవడంతో తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఈ రాత్రికే ప్రత్యేక విమానంలో ఢిలీకి ముఖ్యమంత్రి బయలుదేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.  


ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంకోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని అధికారులు తెలిపారు. ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్‌ సమస్య తలెత్తిందని పైలట్‌ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. సమస్యను గుర్తించిన పైలట్‌ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారని అన్నారు.


'ఢిల్లీ పర్యటనకోసం ముఖ్యమంత్రి, అధికారుల బృందం సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్‌ అయ్యింది. కాసేపటికే పైలట్‌ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో ల్యాండ్ అయ్యారు. సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాత్రే 9 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు..' అని సీఎంఓ అధికారులు వెల్లడించారు.


Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. బడ్జెట్‌లో కేంద్రం భారీ ప్రకటన..?  


Also Read: Viral Video: సర్జరీ చేస్తుండగా డాక్టర్ల మధ్య గొడవ.. పేషెంట్‌ని వదిలేసి ఇలా.. లైవ్ ఫుటేజీ లీక్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook