హోదా కోసం ఆ పని చేశారా అంటూ...సభలో చంద్రబాబును నిలదీసిన జగన్
ఏపీ సీఎం జగన్ ఈ రోజు అసెంబ్లీలో ప్రత్యేక హోద అంశాన్ని ప్రస్తావించారు
అమరావతి: ఈ రోజు ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. సభలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటి ప్రశ్న సంధించారు. చంద్రబాబు తన గుండెల మీద చేయి వేసుకొని తనకు తాను అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది... ప్రత్యేక హోదా విషయంలో చిత్తశుద్ధితో ప్రయత్నించానా అని ప్రశ్నవేసుకోవాల్సి ఉందన్నారు.
హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు తీరు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని నిండు సభలో సీఎం జగన్ ఆరోపించారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోదా కోరుతూ ప్లానింగ్ కమిషన్ కు ఒక్కసారి కూడా లేఖ రాయలేదన్నారు. గట్టిగా ప్రయత్నించి ఉంటే స్పెషల్ స్టేటర్ ఎప్పుడో వచ్చి ఉండేదని జగన్ అభిప్రాయపడ్డారు.
ప్లానింగ్ కమిషన్ కు లేఖ రాశారా ?
ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునేది కేంద్ర క్యాబినేట్ ...ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం.. కానీ సిఫార్సు చేసేది నీతి ఆయోగ్ లేదా ప్లానింగ్ కమిషన్.. అయితే నీతీ ఆయోగ్ వచ్చే వరకు ప్లానింగ్ కమిషన్ అమలులో ఉంది. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడూ ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పలేదు. నీతి ఆయెగ్ వచ్చింది 1 జనవరి 2015...చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసింది 2014 జూన్ 7న .... అంటే ఏడు నెల పాటు ప్లానింగ్ కమిషన్ అమలులో ఉంది.. చంద్రబాబు ఏడు నెలల పాటు ప్లానింగ్ కమిషన్ కు ప్రత్యేక హోదా కోరుతూ లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. ప్లానింగ్ కమిషన్ లో హోదా ఆల్ రెడీ పాయిన అర్డర్..కేవలం అమలు చేయండి అని చెప్పాల్సిన కార్యక్రమాన్ని చంద్రబాబు చేయలేదంటే ఎలా అర్థం చేసుకోవాలని జగన్ ప్రశ్నించారు.