Ys jagan: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల పోరు ముగిసింది. అధికారపార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ మద్దతుదారులు గెలవడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ పంచాయితీ ఎన్నికల్లో( Ap panchayat elections) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు భారీగా విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 80.37 శాతం పంచాయితీల్ని వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ భారీ ఆధిక్యత కనబర్చింది. ప్రతిపక్షనేత చంద్రబాబు ( Chandrababu )సొంత నియోజకవర్గం కుప్పంలో మెజార్టీ పంచాయితీల్ని వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు దక్కించుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( Peddireddy Ramachandra reddy )పర్యవేక్షణలో ఈ విజయం సాధ్యమైంది. ఈ విజయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన సందర్బంగా..వైఎస్ జగన్ మంత్రి చేసిన కృషిని ప్రశంసించారు. 


అనంతరం మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారని..ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan) పనితీరుకు ఈ ఫలితాలే నిదర్శనమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏదో సాధించాలని చతికిలపడ్డారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పునాదులు కదులుతున్నా సరే..అసత్య కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా జరిగుంటే..కచ్చితంగా 90 శాతం పైగా గెలిచేవాళ్లమన్నారు. ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని..ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఫలితాలు వచ్చాయన్నారు. కుప్పం నియోజకవర్గంలోని ఫలితాలే చంద్రబాబు ( Chandrababu )పై వ్యతిరేకతకు నిదర్శనమని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామన్నారు. 


Also read: Ap Panchayat Elections: ముగిసిన పంచాయితీ పోరు, చివరి దశలో కూడా అధికార పార్టీదే హవా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook