Disha App Campaign: మహిళల రక్షణకై ప్రవేశపెట్టిన దిశ యాప్‌పై అవగాహన కల్పించే కార్యక్రమం ప్రారంభమైంది. ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునే అస్త్రం దిశ యాప్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆపదలో ఉన్న మహిళల్ని తక్షణం ఆదుకునేందుకు, విపత్కర పరిస్థితుల్నించి రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం దిశ యాప్ (Disha App) ప్రవేశపెట్టింది.ఇప్పుడీ యాప్‌పై ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడిలో దిశ యాప్ అవగాహన సదస్సు ఏర్పాటైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునే అస్త్రం దిశ యాప్ అని వైఎస్ జగన్ (Ap ys jagan) తెలిపారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లని చెప్పారు. పెద్ద సంఖ్యలో విద్యార్ధినులు, యువతులు, మహిళలు దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.


దిశ యాప్‌పై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని..ప్రతి మహిళ దిశ యాప్ డౌన్‌లోడ్(Disha App Download)చేసుకునేలా చేయాలని అధికారులకు సూచించారు.యువతులు, మహిలల భద్రత కోసమే దిశ యాప్ రూపకల్పన జరిగిందని చెప్పారు.ఇప్పటి వరకూ 17 లక్షలమంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని..స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క మహిళ దిశ యాప్ వినియోగించాలని కోరారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించామన్నారు. దిశ కేసుల విచారణకై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. 


Also read: Disha App: దిశ యాప్ ఎలా పని చేస్తుంది, ప్రయోజనాలేంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook