Ys jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిన్న రాత్రి సమావేశమయ్యారు. ఇవాళ ప్రధాని మోదీ సహా ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ నిన్న రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విభజన జరిగి 9 ఏళ్లైనా ఏపీ సమస్యల్ని ఇంకా పరిష్కరించలేదని..ఇంకెప్పుడు పరిష్కరిస్తారని కోరారు. ప్రధానంగా 13 అంశాల్ని అమిత్ షాతో చర్చించారు. రెండు అంశాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ఒకటి పోలవరం కాగా రెండవది విభజన సమస్యలు. ఈ రెండు అంశాలే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సాగింది. పోలవరం నిధుల్ని తక్షణం విడుదల చేయాలని కోరారు. పోలవరం రివైజ్డ్ ఎస్టిమేట్స్‌ను ఆమోదించాలని, ఆర్ఆండ్ఆర్ ప్యాకేజ్‌పై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రధానంగా పోలవరం నిర్మాణానికి అడ్వాన్స్‌గా 10 వేల కోట్లు, డయాఫ్రమ్ వాల్ మరమ్మత్తుకు 2 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2600 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. అదే సమయంలో పోలవరం రివైజ్డ్ ఎస్టిమేషన్ 55,548 కోట్లకు ఆమోదించాలన్నారు.


రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లైనా ఇంకా హామీలు అమలు చేయలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గుర్తు చేశారు. మరోవైపు రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ రూపంలో ఏపీకు రావల్సిన 36,625 కోట్లను వెంటనే మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 12 మెడికల్ కళాశాలలకు అనుమతి, ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. ఇవాళ ప్రదాని మోదీని కలవనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.


Also read: Roja Warns Nara Lokesh: పిల్లగాడు లోకేష్‌కి ఇదే నా వార్నింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook