ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వైఎస్ జగన్
రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే 60 వరకు పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. నేటి ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారామ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే సంఖ్యాబలం అధికంగా ఉన్న వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్లపై ఫోకస్ చేసి సరిగ్గా ఓట్లు వేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ సూచించారు. YSRCP 4 సీట్లు క్వీన్‌స్వీప్ చేయడం ఖాయం!
అయితే నేటి ఉదయం 9 గంటలకు రాష్ట్రంలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటికే దాదాపు 60 శాతం ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకుగానూ 125 మంది వరకు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి ప్రాధాన్యాత ఓట్లు ఒక్కో అభ్యర్థికి 36 వస్తే చాలు. ఈ విధంగా వైఎస్సార్‌సీపీ ముందుగానే ప్లాన్ చేసుకుని ఓటింగ్‌లో పాల్గొన్నారు. హాట్ ఫొటోలతో యాంకర్ Varshini రచ్చరచ్చ!
కాగా, దేశ వ్యాప్తంగా నేడు 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 55 స్థానాలు ఖాళీ ఖాగా, 37 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ