AP Assembly Budget Session 2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏపీ అసెంబ్లీ రెండవ రోజు సంతాప తీర్మానంతో ప్రారంభమైంది. సంతాప సూచకంగా రేపు సభకు సెలవు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండవరోజు ప్రారంభమయ్యాయి. ఇటీవల గుండెపోటుతో మరణించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంతో రెండవ రోజు సభ ప్రారంభమైంది. సహచర మంత్రి, స్నేహితుడైన గౌతమ్ రెడ్డి సంతాపాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. అనంతరం సభలో సభ్యులు సంతాపం తెలిపారు. మేకపాటి గౌతమ్ రెడ్డి వివాదరహితుడని..అహం లేని వ్యక్తి అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అలాంటి సహచర మంత్రి సంతాపం తీర్మానంపై మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందనుకోలేదని ఆవేదన చెందారు. గౌతమ్ రెడ్డి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని..మంత్రులు తెలిపారు. 


సంతాప తీర్మానంపై సభలో చర్చ పూర్తయిన తరువాత అసెంబ్లీ వాయిదా పడనుంది. అటు శాసనమండలిలో కూడా సంతాప తీర్మానం ప్రవేశపెట్టి..చర్చ అనంతరం సభను వాయిదా వేస్తారు.గౌతమ్ రెడ్డి మృతికి సంతాపంగా రేపు ఉభయ సభలకు సెలవు ప్రకటించారు.ఈ నెల 10 వతేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. మరుసటి రోజు అంటే ఈ నెల 11 వ తేదీన కీలకమైన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 25 వరకూ నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయించింది.


Also read: Legislature vs Judiciary: అసెంబ్లీలో అమరావతి హైకోర్టు తీర్పుపై కీలక చర్చ, శాసనసభ వర్సెస్ న్యాయవ్యవస్థలో ఎవరిది పైచేయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook