ISRO: ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
ISRO: ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్‌వి సి 50 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ISRO: ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్‌వి సి 50 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కమ్యూనికేషన్ శాటిలైట్ ( Communication satellite ) రంగంలో మరో ఘనత సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలపై ( Isro scientists ) అభినందనలు కురుస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( ap cm ys jagan ) ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్‌వి సి 50 రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంతో హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో చేసే ప్రయోగాలు కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ( ISRO ) మరో ఘనత సాధించింది. ఏపీ శ్రీహరికోట ( Sriharikota ) షార్ సెంటర్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి విజయవంతంగా పీఎస్ఎల్‌వి శ్రేణిలో సీ 50 రాకెట్ ప్రయోగించింది. 1410 కిలోల బరువున్న కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-01 ( CMS-01 )ను ఆర్బిట్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతమవడంతో మరింత మెరుగైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు ( Broadband services ) లభిస్తాయి. దీని పరిధి భారత్‌తో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ల వరకూ విస్తరిస్తుంది.
మరోవైపు పీఎస్ఎల్‌వి సి 50 రాకెట్ ప్రయోగం విజయంపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ( Ap governor Biswabhushan harichandan ) ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయిని అధిగమించిందని చెప్పారు. కోవిడ్ సమయంలో సైతం ప్రయోగాలు విజయవంతం చేయడం శాస్త్రవేత్తల అంకితభావానికి నిదర్శనమన్నారు. Also read: ISRO: ఇస్రో మరో ఘనత, నింగిలోకి విజయవంతంగా పీఎస్ఎల్‌వీ సి 50 రాకెట్