Bus Accident: భాకరాపేట ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు పరిహారం
Bus Accident: తిరుపతి సమీంలోని భాకరాపేట ఘాట్ రోడ్ బస్సు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.
Bus Accident: తిరుపతి సమీంలోని భాకరాపేట ఘాట్ రోడ్ బస్సు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.
తిరుపతి సమీపంలోని చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత ధర్మవరం నుంచి పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ప్రైవేటు బస్సు..చంద్రగిరి మండలం సమీపంలో భాకరాపేట వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న దాదాపు 100 అడుగుల లోయలో పడిపోయింది. బస్సు లోయలో పడిన ఘటనలో బస్సు డ్రైవర్, ఒక చిన్నారి సహా 10 మందికి పైగానే చనిపోయారని తెలుస్తోంది. లోయలో పూర్తిగా చీకటి అలుముకుని ఉండటంతో చీకట్లో ఏమీ కనిపించే పరిస్థితి లేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది వరకు పెళ్లి బృందం ఉన్నట్టు సమాచారం.
ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం, గాయపడినవారికి 50 వేల రూపాయలు ప్రకటించారు. బాధితులు కోలుకునేంతవరకూ నాణ్యమైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రమాదం జరగడానికి గల కారణాల్ని, జరుగుతున్న సహాయకచర్యల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే..జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా సహాయకచర్యల్లో పాల్గొన్నారు.
Also read: Bus Falls Into Gorge: ఘోర ప్రమాదం.. 50 మంది ప్రయాణికులతో లోయలో పడిన పెళ్లి బస్సు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook