AP CM YS Jagan focusing on YSRCP MLAs performance: అమరావతి: ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లే మిగిలి ఉండటంతో వైఎస్సార్సీపీలో 50 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చొరవ చూపడం, పార్టీ అభివృద్ధికి కృషి చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వారి పని తీరుపై ఓ అభిప్రాయానికి వచ్చినట్టు మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ 50 మంది నేతలకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ కేటాయించే అవకాశాలే లేవనేది ఆ ప్రచారం సారాంశం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సదరు 50 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే వైఎస్ జగన్‍కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందినట్టు సమాచారం. పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇతరత్రా ఆరోపణల్లో పేర్లు ప్రముఖంగా వినిపించిన కొంతమందిపై వేటు పడనుండగా.. పార్టీ పట్ల నిబద్దత చూపించని వారిని, పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న ఇంకొందరిపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.


ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురికానున్న 50 మంది ఎమ్మెల్యేల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారే 30 మంది ఉన్నారని వినికిడి. ఆ 30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారట. అందులో అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారు కొందరైతే.. వివాదాల్లో తలదూర్చి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వారు ఇంకొందరున్నారని.. సీఎం జగన్ ఆగ్రహానికి అదే కారణమై ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక మిగతా 20 మందిలో 12 మంది సీనియర్ ఎమ్మెల్యేలు కాగా మరో 8 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికే ఆ 50 మందికి సంబంధించిన జాతకాలు వైఎస్ జగన్ (AP CM YS Jaganmohan Reddy) చేతిలో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.


Also read : Intermediate Exams: ఏపీ ఇంటర్ పరీక్షలకు జేఈఈ మెయిన్స్ గ్రహణం, మళ్లీ వాయిదా పడనున్న పరీక్షలు


Also read : Pawan Kalyan: ఆనాడు గాడిదలు కాసావా?.. పందుల దొడ్లో పడుకున్నావా?! పవన్‌పై ఏపీ మంత్రి ఫైర్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook