Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట.. మరి వైసీపీ ఏమంటోంది ?

Chandra babu Predicts Early Elections In AP: అమరావతి: చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఐతే నవ్యాంధ్ర ప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ముందస్తు ఎన్నికల మాటే లేదు. 2018లో తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు.

Last Updated : Mar 10, 2022, 03:24 PM IST
  • చంద్రబాబు వ్యాఖ్యలతో తెరపైకి ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం..
  • 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సీఎం కేసీఆర్
  • ఏపీలో రంజుమీదున్న రాజకీయాలు
Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట.. మరి వైసీపీ ఏమంటోంది ?

Chandra babu Predicts Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా ? ముందే ఎన్నికలకు వెళ్లాలని ఏపీ సీఎం జగన్‌ భావిస్తున్నారా ? సీఎం జగన్ మదిలో ఏం ఉంది ? ముందస్తు ముచ్చటపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది ? ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల ముచ్చట వినిపిస్తోంది. సీఎం జగన్‌ పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని.. ఈక్రమంలోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జగన్‌ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేతలకు సూచించారు. 

చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీలో ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఐతే నవ్యాంధ్ర ప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ముందస్తు ఎన్నికల మాటే లేదు. 2018లో తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అఖండ విజయం సాధించారు. ప్రజా వ్యతిరేకతను ముందే పసిగట్టిన కేసీఆర్.. ముందస్తుకు వెళ్లారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు అదే ఫార్ములాను జగన్‌ పాటిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. తమను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని.. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తామంటున్నారు. రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామంటున్నారు. మొత్తంగా ఏపీలో రాజకీయాలు రంజుమీద ఉన్నాయి. ప్రతి అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Also read : Rajamouli: తెలుగు రాష్ట్రాల సీఎంలకు డైరెక్టర్ రాజమౌళి కృతజ్ఞతలు

Also read : Poonam Kaur: దేశం విడిచి వెళ్లిపోదామనుకున్నా.. అప్పుడే నాకు ఓ కాల్ వచ్చింది! కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్‌ కౌర్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News