AP Independence Day Celebration: ఆంధ్రప్రదేశ్‌లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇందిరాగాంధీ స్డేడియంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయవాడ ఇందిరాగాంధీ స్డేడియంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు(Independence Day Celebrations) ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. 


ముందుగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ(Independence day) శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకునే సమయని..ప్రతి ఒక్కరికీ రేపు అనే భరోసా ఇవ్వాలని కోరారు. హక్కులు అందరికీ సమానంగా ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామని..రెండున్నరేళ్ల కాలంలో పలు సంక్షేమ పథకాలు చేపట్టామని వైఎస్ జగన్ (Ap cm ys jagan)గుర్తు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగంపై 83 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ప్రతి నెలా 1వ తేదీకే వృద్ధ్యాప్త పెన్షన్లను ఇంటివద్దకే అందిస్తున్నామన్నారు. అమ్మఒడి పథకం(Ammavodi scheme) ద్వారా రెండేళ్లలో 13 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. 


Also read: AP Corona Update: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి, ప్రభుత్వ చర్యలపై ఎయిమ్స్ ప్రశంసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook