తొలి Disha Police Station ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
దిశ ఘటనతో ఏపీ సర్కార్ ఏకంగా దిశ చట్టాన్నే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. రాజమండ్రిలో శనివారం దిశ పోలీస్ స్టేషన్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
అమరావతి: సంచలనం రేపిన దిశ ఘటనతో ఏపీ సర్కార్ ఏకంగా దిశ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో శనివారం దిశ పోలీస్ స్టేషన్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇకనుంచి 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ ను జగన్ ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి స్టేషన్ ఏర్పాటు కానుండటం గమనార్హం.
Also Read: నిర్భయ దోషుల ఉరి వాయిదాపై దిశ తండ్రి సంచలన వ్యాఖ్యలు
షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7న సీఎం వైఎస్ జగన్ దిశ పోలీస్ స్టేషన్‌ను, ఒన్ స్టాప్ సెంటర్లను ప్రారంభించాల్సి ఉంది. అయితే అనికార్య కారణాలతో నేటికి దిశ పీఎస్ లాంచింగ్ వాయిదా పడింది. ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 1097 పోలీస్ స్టేషన్లలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఓవరాల్‌గా 13 జిల్లాలకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వెయిటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్, పిల్లలకు చనుబాలిచ్చేందుకు గది, ఇతరత్రా సౌకర్యాలు ఉంటాయి. డీఎస్పీ స్థాయి ఉన్న ఇద్దరు అధికారులు, అయిదుగురు ఇన్ స్పెక్టర్లు, 18 మంది కానిస్టేబుల్స్, ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఒక సైబర్ నిపుణుడు ఈ స్టేషన్‌కు సేవలందిస్తారు. ఏపీలో ప్రతి ఏడాది సరాసరి 600 అత్యాచార కేసులు, 1000 పోక్సో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం.
Also Read: దేశంలో తొలిసారిగా.. ‘దిశ’ పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్
మహిళలు, చిన్నారులను కించపరిచేలా మాట్లాడిన వారిని, వారిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై దిశ చట్టం ద్వారా చర్యలు తీసుకుంటారు. తొలిసారి తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలుశిక్ష, మరోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టంలో పేర్కొన్నారు. లైంగిక దాడులు, లైంగికంగా వేధిస్తే ప్రస్తుతం ఐదేళ్ల వరకు శిక్షించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి నిందితులకు గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా దిశ చట్టం రూపొందించారు. ఉరిశిక్ష వేసేందుకు అవకాశాన్ని కల్పించాలని సైతం కేంద్రానికి, సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్ కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రాష్ట్ర సర్కార్‌కు నిరాశ ఎదురైంది.
Also read: ఏపీలో దిశ చట్టం.. పూర్తి వివరాలు