Clean Andhra prdesh: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి చెత్త సేకరణ వాహనాలకు జెండా ఊపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్ ఆంధ్రప్రదేశ్(Clean Andhra pradesh)-జగనన్న స్వచ్ఛ సంకల్పం(Jagananna Swachh Sankalpam) కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా భారీగా కార్యక్రమం మొదలైంది. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ఏకంగా 4 వేల 97 చెత్త సేకరణ వాహనాల్ని ప్రారంభించారు. జగనన్న స్వచ్ఛసంకల్పం సీడీని వైఎస్ జగన్ (Ap cm ys jagan)ఆవిష్కరించారు. బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని జాతీయస్థాయిలో తీర్దిదిద్దే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉత్తమ ర్యాంక్ సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమం వందరోజులపాటు కొనసాగనుంది. 


క్లీన్ ఆంధ్రప్రదేశ్(Clean Andhra pradesh) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 20 కోట్ల డస్ట్ బిన్‌లను పంపిణీ చేయనున్నారు. ఇళ్లలోనే తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరే చేసేలా ప్రతి ఇంటికి మూడేసి డస్ట్ బిన్‌లను క్లాప్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రంలోని 123 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోని 40 లక్షల ఇళ్లకు 1.20 కోట్ల డస్ట్ బిన్లు పంపిణీ కానున్నాయి.దీనికోసం 100 కోట్ల నిధుల్ని ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో 15 వందల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనుంది. చెత్త సేకరణ, తరలింపుకై 3 వేల 97 ఆటో టిప్పర్లు, 1 771 ఎలక్ట్రిక్ ఆటోల్ని పంపిణీ చేయనున్నారు. సేకరించిన చెత్తను 5 వేల 868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తరలిస్తారు. చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్ని కొత్తగా 4 వేల 171 ఏర్పాటు చేస్తోంది. చెత్త రవాణా కోసం గ్రామ పంచాయితీలకు 14 వేల త్రిచక్ర వాహనాల్ని పంపిణీ చేయనున్నారు.వ్యర్ధాల్ని నిర్ణీత ఉష్ణోగ్రతల వద్ద భస్మం చేసి పర్యావరణహితంగా మార్చేందుకు 6 వేల 417 ఇన్సినలేటర్ పరికరాల్ని ప్రభుత్వం సమకూర్చుతోంది. ఇక పంచాయితీల్లో వర్మి కంపోస్ట్ నిర్వహణ, నాన్ రీసైక్లింగ్ వ్యర్ధాల్ని సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలు, సంపద తయరీ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది.



 


Also read: Dubai Expo Opens: ప్రపంచ అద్భుతాల వేదిక దుబాయ్ ఎక్స్‌పో 2020 ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook