AP Investments: రాష్ట్రంలో 20 వేల కోట్లతో కొత్త పరిశ్రమలు, 70 వేల ఉద్యోగాలు..సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
AP Investments: ఏపీలో భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు రానున్నాయి. ఏపీ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఈ మేరకు పలు ప్రతిపాదనలు, ప్రోత్సహకాలకు ఆమోదం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు తరలిరానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Investments: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కీలకమైన సమావేశం జరిగింది. ఏపీ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్టు సమావేశంలో రాష్ట్రంలో ప్రతిపాదిత పరిశ్రమలు, ప్రోత్సాహకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు జగన్.
ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పుల్ని అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవడం ద్వారా అందుకు తగ్గ ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. పూర్తి పారదర్శక విధానాలతో పరిశ్రమల స్థాపనకు అనువైవ వాతావరణాన్ని తీసుకురావాలని కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగుల్లో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచిందనే విషయాన్ని గుర్తు చేశారు. పరిశ్రమల ఏర్పాటుకై ఇచ్చే అనుమతులు ఇతర అంశాల్లో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని చెప్పారు. ఏ చిన్న సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నామనే భరోసాను పారిశ్రామికవేత్తలకు కల్పిస్తున్నామన్నారు. అనుమతులు, క్లియరెన్స్ విషయాల్లో మరింత వేగం ఉండాలని సూచించారు. ఇవాళ జరిగిన సమావేశంలో మొత్తం 19,037 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో కొత్తగా 70 వేల ఉద్యోగాలు రానున్నాయి.
ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిశ్రమలు
1. విశాఖపట్నం జిల్లా పద్మనాభం సమీపంలో 50 కోట్లతో ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్ ఏర్పాటు
2. విజయనగరం జిల్లా ఎస్ కోటలో 531 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు
3. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 1750 కోట్లతో శ్రేయాస్ ఇండస్ట్రీస్ ఏర్పాటు
4. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో 166 కోట్ల పెట్టుబడితో స్మైల్ కంపెనీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ
5. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో 679 కోట్లతో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ విస్తరణ
6. తూర్పు గోదావరి కడియం వద్ద 4 వేల కోట్ల పెట్టుబడితో ఆంధ్రా పేపర్ మిల్స్ విస్తరణ
7. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 6,174 కోట్ల పెట్టుబడిలో రిలయన్స్ పవర్ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియే ఉత్పత్తి ప్లాంట్
8. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 933 కోట్లతో ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ విస్తరణ
9. ఏలూరు జిల్లా కొమ్మూరులో 114 కోట్లతో వెంకటేశ్వరా బయోటెక్ పరిశ్రమ
10. చిత్తూరు జిల్లా పుంగనూరులో 4,640 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ స్థాపించనున్న పెప్పర్ మోషన్ కంపెనీ
Also read: Chandrababu Bail: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్, రేపు వెల్లడిస్తామన్న హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook