AP Three Capitals: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మూడు రాజధానుల రగడ ప్రారంభం కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పూర్తి స్థాయిలో సిద్ధమౌతున్న కొత్త వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కి తగ్గడం లేదు. సాంకేతిక కారణాలతో గతంలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పూర్తి స్థాయిలో సమగ్రమైన కొత్త బిల్లును త్వరలో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పుడే ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మెరుగైన బిల్లు ప్రవేశపెడతానన్న వైఎస్ జగన్ కార్యాచరణను కూడా ప్రారంభించేశారని సమాచారం.


ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న కొత్త వికేంద్రీకరణ బిల్లుపై సాంకేతికంగా ఏ విధమైన అడ్డంకులు లేకుండా రూపొందిస్తున్నారు. రాష్ట్ర పరిపాలన కోసం ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా రాజధానుల సంఖ్య పెంచుకోవచ్చని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఇప్పటికే రాజ్యసభలో స్పష్టం చేశారు. ఈ క్రమంలో సమగ్రమైన కొత్త వికేంద్రీకరణ బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనేది సీఎం జగన్ ఆలోచనగా ఉంది. కొత్త జిల్లాల బిల్లుతో పాటు మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. ఈలోగా అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలనేది ప్రభుత్వ వ్యూహం. 


మార్చ్ 4 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు పదిరోజలు లేదా అంతకంటే ఎక్కువరోజులు కొనసాగవచ్చు. ఈ సమావేశాల్లోనే కొత్త వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. హైదరాబాద్ వంటి ఏకైక సూపర్ కేపిటల్ విధానానికి వ్యతిరేకమని సీఎం జగన్ (Ap cm ys jagan) గతంలోనే స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే..సూపర్ కేపిటల్ విధానం ఉండకూడదని జగన్ ఆలోచన. లేకపోతే మరో చారిత్రక తప్పిదం జరుగుతుందని ఆయన అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. వికేంద్రీకరణే సరైన విధానమని తాము బలంగా విశ్వసిస్తున్నామని..అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నట్టు జగన్ చెప్పారు. ఇందులో భాగంగా త్వరలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి మూడు రాజధానుల బిల్లు, వార్షిక బడ్జెట్ కేటాయింపుల్ని నిర్దారించుకోనున్నారు. అనంతరం జరిగే బడ్జెట్ సమావేశాల్లో కొత్త వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 


Also read: Anantapur Road Accident: అనంతపురం విషాదంపై ప్రధాని మోదీ విచారం, పరిహారం ప్రకటించిన ప్రధాని


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook