న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీతో బుధవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ దాదాపుగా 100 నిమిషాల పాటు ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని 15వ ఆర్ధిక సంఘం చెప్పిన విషయాన్ని వినతిపత్రంలో పేర్కొన్న సీఎం జగన్, అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 25 ఉగాది పర్వదినాన 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు అందజేస్తున్నట్టు లేఖలో తెలిపారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని, ఈ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించినట్టు లేఖలో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పుభూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా కోరారు. 


పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55549 కోట్లకు చేరిందని, ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33010 కోట్ల రూ. అవసరముందని,
కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలను రూ.55549 కోట్లుగా ఫిబ్రవరి 2019న అంచనాలు వేసిన అంశాన్ని ప్రధానికి లేఖలో తెలిపారు. 


ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని, రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని,పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.  


కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని వినతి కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే... కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులునూ వెంటనే విడుదల చేయలని అన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని కోరినట్టు లేఖలో పేర్కొన్నారు. 


హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం –2019కు ఆమోదం, శాసనమండలి రద్దు అంశాన్ని పరిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు.  
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..