Vanijya Utsav: విజయవాడలో వాణిజ్య ఉత్సవం - 2021ను ప్రారంభించిన సీఎం జగన్, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యం
2 day Vanijya Utsav : ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు.
Two day Vanijya Utsav 2021 in Vijayawada : ఆంధ్రప్రదేశ్ వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవం-2021 ను నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. మంగళవారం విజయవాడలో ఈ ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో (Vanijya Utsav) ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ (CM Jagan) సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్ ఉత్పత్తులకు సంబంధించిన పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో (Azadi Ka Amrit Mahotsav) భాగంగా ఏపీ వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేసే దిశగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. నేడు ప్రారంభమైన ఈ వాణిజ్య ఉత్సవం బుధవారం కూడా కొనసాగనుంది.
ఏపీ నుంచి అత్యంత చౌకగా ఎగుమతుల లక్ష్యంగా ఈడీబీ ప్రణాళికలు చేస్తోంది. ప్రస్తుతం ఏపీ నుంచి నాలుగు ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఏపీ నుంచి 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
2030నాటికి రెట్టింపు ఎగుమతులు సాధించడమే ధ్యేయంగా..
ఎగుమతుల్లో ఏపీని అగ్రపథాన నిలబెట్టడమే లక్ష్యంగా వాణిజ్య ఉత్సవం - 2021 నిర్వహిస్తున్నారు. 2030నాటికి రెట్టింపు ఎగుమతులు సాధించడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం వాణిజ్యఉత్సవం నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు దేశవిదేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విధాన రూపకర్తలు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం (Ap Government), ప్లాస్టిక్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ (plastic export promotion council) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత అండ, రాబోయే పెట్టుబడిదారులు, ఎగుమతిదారుల కోసం ఎక్స్‌పీరియన్స్ సెంటర్, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులకు అవార్డులు అందించి ప్రోత్సాహం అందించనున్నారు.
వాణిజ్య ఉత్సవం ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఏపీ ఎగుమతులు రెండేళ్లలో 19.43 శాతం వృద్ధి చెందాయని పేర్కొన్నారు. 2020-2021లో రూ. 1.23 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో (ease of doing business) ఏపీ (AP) మొదటి స్థానంలో ఉందని తెలిపారు. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందన్నారు. రెండేళ్లలో రూ. 20, 390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.
విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదారాబాద్- బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్‌ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ (YSR Jagananna Mega Industrial) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్షరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 3గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, 13వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2023-2024 కల్లా భావనపాడు, మచిలీపట్నం, రాయామపట్నం పోర్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
3 వేల మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ. 500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో ఏపీ 10 శాతం వాటి సాధించడమే లక్ష్యమని అన్నారు.
Also Read : UK New Travel Rules: యూకే జాతి వివక్ష, ఇండియా సహా కొన్ని దేశాలపై కొత్త ట్రావెల్ ఆంక
నాలుగో స్థానంలో..
2019-20లో ఎగుమతుల్లో ఏపీ (AP) ఏడోస్థానంలో ఉండగా, 2020-21నాటికి నాలుగో స్థానంలో నిలిచింది. దేశ ఎగుమతుల్లో 5.8శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 2030నాటికి 10శాతం సాధించడమే ఈ ఉత్సవ లక్ష్యం. ఏపీ ఎగుమతుల్లో (AP Exports) కీలక ఉత్పత్తుల వాటాలో సముద్ర ఉత్పత్తులు 15శాతం, నౌక, బోట్ స్ట్రక్చర్స్ 8.4శాతం, ఔషధాలు 7.3శాతం, ఇనుము ఉక్కు 7.4శాతం, బియ్యం 4.6శాతంగా ఉన్నాయి. అలాగే ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికో ఆహారశుద్ధి యూనిట్ చొప్పున ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం (AP Government) భావిస్తోంది. అలాగే ఎగుమతులు, ఆహారశుద్ధి యూనిట్లపై దృష్టి సారించాలాని యోచిస్తోంది.
Also Read : Memes on Raj Kundra Bail: శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా మీమ్స్.. ఆడుకుంటున్న నెటిజన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook