హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి శుక్రవారం ఉదయం 9:40 గంటలకే మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. ఏపీ సీఎం జగన్‌కు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి ఎదురెళ్లి ఘనస్వాగతం పలికారు. 


ఇదిలావుంటే మరోవైపు మేడిగడ్డ వద్ద గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించిన శృంగేరి పీఠం అర్చకులు అక్కడ జలసంకల్ప మహోత్సవ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ ఈ యాగంలో పాల్గొన్నారు. వరుణ దేవుణ్ణి ఆహ్వానిస్తూ మహాసంకల్ప యాగం కొనసాగుతోంది.