AP CM YS Jagan Mohan Reddy review meeting on set internet digital libraries to every village Andhra Pradesh: ప్రతి గ్రామానికి డిజిటల్‌ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్‌ విడ్త్‌తో ఇంటర్నెట్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాని వైఎస్ జగన్ సూచించారు. ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలపై వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతపురం, (Anantapur) చిత్తూరు, విశాఖపట్నంతో (Visakhapatnam) పాటు తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు జగన్. ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలని సీఎం పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌ విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలు (YSR Village Digital Libraries) నిర్మాణం చేపడుతున్నామని అధికారులు సీఎం జగన్‌కు (CM Jagan‌) వివరించారు. మూడు దశల్లో విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. అలాగే మొదటి విడతలో చేపడుతున్న 4530 విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ పనుల వివరాలన్నింటినీ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 


Also Read : IRCTC Share News Today: కేంద్రం నిర్ణయంతో పడిలేచిన ఐఆర్‌సీటీసీ షేర్లు 


విలేజ్‌ డిజిటల్‌ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలని.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉపయోగపడాలని సీఎం జగన్‌ (CM Jagan‌) ఆదేశించారు. జనవరి నాటికి మొదటి దశలో డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.


Also Read : Puneeth Rajkumar Health: గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook