Cabinet Meet : ఏపీలో సీఎం జగన్‌ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం

Andhra Pradesh Cabinet Meet agenda: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో భేటీ కానున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 09:59 AM IST
  • ఆంధ్రప్రదేశ్‌ లో నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ
  • గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం వైఎస్‌ జగన్‌
Cabinet Meet : ఏపీలో సీఎం జగన్‌ అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం

Andhra Pradesh Cabinet Meet Chaired By CM YS Jagan today Whats on the agenda: ఆంధ్రప్రదేశ్‌ లో గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Andhra Pradesh Cabinet Meet) నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో (Biswa Bhushan Harichand) భేటీ కానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై నేడు చర్చించనున్నారు. అయితే ప్రధానంగా చర్చకు అంశాలు ఈ విధంగా ఉన్నాయి. దేవాదాయ శాఖ చట్ట సవరణలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గుట్కా నిషేదానికి (Gutka ban) చట్ట సవరణపై చర్చించే అవకాశం ఉంది.

Also Read : Telangana inter Spot valuation: తెలంగాణ ఇంటర్ స్పాట్ వ్యాల్యూయేషన్ తేదీలు

ఇక ఫిలిమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ భేటీలో (Andhra Pradesh Cabinet Meet) చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు పై కూడా సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) అధ్యక్షతన సమావేశమయ్యే నేటి కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Also Read : YS Vivekananda Reddy : వివేకా హత్యలో ఆ నలుగురి పాత్ర ఉందన్న సీబీఐ

అలాగే అమ్మ ఒడి పథకం (Amma Vodi Scheme) అమలు పై మంత్రివర్గ సమావేశం చర్చించనున్నారని తెలుస్తోంది. ఏపీలో (AP) కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా కేబినెట్‌ భేటీలో (Cabinet Meet) చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.

Also Read : Shirdi Sai Baba vachans: షిర్డీ సాయిబాబా అనుగ్రహం కోసం సాయి ఏకాదశ సూత్రములు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News