KOO APP: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన దేశీయ సామాజిక మాధ్యమం కూ యాప్ క్రమక్రమంగా అందరికీ చేరువవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూ యాప్‌లో యాక్టివ్ అవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత మైక్రో బ్లాగింగ్, సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్‌ఫామ్ కూ యాప్ (Koo App)ఇప్పుడు అందరికీ చేరువవుతోంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల బాటలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కూ యాప్‌ ద్వారా ప్రజలకు మరింత చేరువ కానున్నారు. ఈ వివరాలను యాప్‌ ప్రతినిధులు స్వయంగా వెల్లడించారు. కూ యాప్‌ వినియోగదారులకు స్థానిక భాషలలో సైతం ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం కల్పిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రితో పాటు సీఎంఓ కార్యాలయం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ కూడా ఈ సోషల్‌ వేదికపై తమ అధికారిక ఖాతాలను ప్రారంభించాయి.


ఇక నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm y jagan) ప్రజలతో తెలుగులోనే ఇంటరాక్ట్ అవుతారని, https://www.kooapp.com/profile/ysjaganలో వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారని కూ యాప్ ప్రతినిధులు తెలిపారు.  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తమ సోషల్‌ వేదిక ద్వారా ప్రజలతో ఇంటరాక్ట్‌ అవుతుండడం పట్ల యాప్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఇది ఎంతో ఉపయుక్తమైన అంశమని అభిప్రాయపడ్డారు. సినీనటులు తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, సినీ నటి ఈషారెబ్బా, అనుష్క శెట్టి, నాగశౌర్య తదితరులు సైతం కూ యాప్‌లో తాజాగా ఖాతా తెరిచారు.


Also read: కరోనా సెకండ్ వేవ్: ఏపీలో కరోనా కేసులపై లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook