AP New Districts: కొత్త జిల్లాల అభ్యంతరాలపై స్పందించిన ప్రభుత్వం, కమిటీ ఏర్పాటు
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల పరిపాలన కొత్త సంవత్సరాది ఉగాది నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు కొత్త జిల్లాలపై అభ్యంతరాలు, సూచనలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. పరిశీలించేందుకు కొత్తగా కమిటీ ఏర్పాటు చేసింది.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల పరిపాలన కొత్త సంవత్సరాది ఉగాది నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు కొత్త జిల్లాలపై అభ్యంతరాలు, సూచనలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. పరిశీలించేందుకు కొత్తగా కమిటీ ఏర్పాటు చేసింది.
ఏపీలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా నిర్ధారిస్తూ రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. మార్చ్‌లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లు ప్రవేశపెట్టనున్నారు. కొత్త సంవత్సరాది ఉగాదికి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. అరకు నియోజకవర్గం భౌగోళికంగా పెద్దది కావడం, ఏకంగా నాలుగు జిల్లాల్లో ఉండటంతో ఆ నియోజకవర్గాన్ని మాత్రం రెండుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అన్ని సాధ్యాసాధ్యాల్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు సిద్ధమైంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే ప్రతి అభ్యంతరం, సూచనల్ని పరిగణలో తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన.
అందుకే అభ్యంతరాలు, సూచనలపై ఆషామాషీగా నిర్ణయం తీసుకోకుండా అన్ని అంశాల్ని అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మరో కమిటీ నియమించింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు సూచనలు, అభ్యంతరాల్ని పరిగణలో తీసుకుంటున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల మనోభావాలకు సంబంధించి తమ దృష్టికొచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీ ఏర్పాటైంది. తాము అందుకునే విజ్ఞప్తుల్ని ఆయా జిల్లాల కలెక్టర్లు www.drpp.ap.gov.in వెబ్‌సైట్‌లో ప్రతిరోజూ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యంతరం, సూచనపై తమ రిమార్కు రాయాల్సి ఉంటుంది.
నెలరోజుల గడువు ముగిసిన తరువాత వచ్చిన అభ్యంతరాలు, సూచనల్ని కమిటీ పరిశీలిస్తుంది. ఆ అభ్యంతరాలు ఎంతవరకూ సహేతుకమైనవో తేల్చుతుంది. అదే విధంగా ప్రతి అభ్యంతరాన్ని పరిగణలో తీసుకోవాలా వద్దా అనేది కూడా కమిటీ సిఫారసు చేస్తుంది. కమిటీ స్క్రూటినీ ప్రక్రియ శాస్త్రీయంగా ఉండాలని ప్రభుత్వం (Ap New Districts)స్పష్టం చేసింది. ఈ కమిటీ సూచనల మేరకే..జిల్లాల పునర్య్వవస్థీకరణలో మార్పులు చేర్పులపై ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత తుది నిర్ణయముంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో అరకు, పాడేరు జిల్లాలు, పుట్టపర్తి జిల్లా కేంద్రం విషయాల్లో తీవ్ర అభ్యంతరాలున్నాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ కూడా ప్రజల్లో ఉంది. మరి కమిటీ వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also read: AP Police: ఏపీ పోలీసుల ఘనత... దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీగా గంజాయి దహనం.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook