Ysr Jayanthi: ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు..వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం కడప జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి(Ysr jayanthi). రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ 72వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద..వైఎస్ జగన్ అంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కడప జిల్లాలో ఏర్పాటైన పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందులలో నిర్మించ తలపెట్టిన మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. పులివెందులను 630 కోట్లతో మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి జగన్ (Ap cm ys jagan) తెలిపారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ కోసం 154 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా మారుస్తున్నామని..30 కోట్ల ఖర్చుతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 


Also read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా వైరస్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook