ఏపీ ప్రభుత్వం తలపెట్టిన జగనన్న చేదోడు మూడవ విడత కార్యక్రమంలో భాగంగా లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా అర్హులైన లబ్దిదారులకు 10 వేల చొప్పున డబ్బులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్షాలు, కొన్ని మీడియాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వినుకొండలో జరిగిన జగనన్న చేదోడు డబ్బుల విడుదల సందర్భంగా జగన్ ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. కొన్ని మీడియా సంస్థలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తోడేళ్లు ఒక్కటౌతున్నాయని..మీ బిడ్డ మాత్రం సింహంలా ఒక్కడే నడుస్తున్నాడని గుర్తు చేశారు వైఎస్ జగన్. మీ బిడ్డకు ఎలాంటి పొత్తులు లేవని..మీ బిడ్డ వాళ్లపై, వీళ్లపై ఆధారపడలేదని...తోడేళ్లు ఒక్కటౌతున్నా భయం లేదని స్పష్టం చేశారు. కారణం..మీ బిడ్డ ప్రజల్ని, దేవుడిని నమ్ముకున్నాడని చెప్పారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా అని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. 


ఇది పేదవాడికి, పెత్తందారుకు మధ్య నడుస్తున్న యుద్ధమని..మాట ఇస్తే నిలబడే వ్యక్తికి, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లకు మధ్య జరుగుతున్న వార్ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గజ దొంగల పాలన కావాలా లేదా లంచాలు, అవినీతికి ఆస్కారం లేని పాలన కావాలో మీరే తేల్చుకోవాలని కోరారు. మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఒంటరిగా నడుస్తున్నాడని..ఉన్న నమ్మకం మీ చల్లని ఆశీస్సులు, దేవుని దీవెనలని తేల్చి చెప్పారు. 


రాష్ట్రాన్ని గతంలో గజదొంగల ముఠా ఒకటి దోచేసిందని..ముఖ్యమంత్రిగా ఉన్న ఓ ముసలాయన, దత్తపుత్రుడు, ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి అంతా గజదొంగల ముఠాలో సభ్యులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. గత ప్రభుత్వ విధానమే దోచుకో, పంచుకో, తీసుకో అని వైఎస్ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


Also read: Jagananna Chedodu: జగనన్న చేదోడు డబ్బులొచ్చేశాయి, మీ ఎక్కౌంట్లో చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook