Sajjala Ramakrishna reddy: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం నెలకొంది. అదే సమయంలో సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారని, విద్వేషాలు వద్దని ప్రభుత్వం చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణా నదీ జలాల వినియోగంపై(Krishna Water Dispute) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గత కొద్దికాలంగా వివాదం నెలకొంది. ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సాగునీటి విషయంలో ఇరుగు, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ys Jagan) విధానమని స్పష్టం చేశారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించేందుకు వైఎస్ జగన్ సిద్ధమన్నారు. సమస్య పరిష్కారమయ్యేలా మాట్లాడాలి తప్ప..విద్వేషాలు పెంచకూడదని సజ్జల తెలిపారు. కొంతమంది తెలంగాణ నేతలు విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెనుక బడిన ప్రాంతం రాయలసీమకు నీరందించాల్సిన అవసరముందని గతంలో కేసీఆర్(KCR) చెప్పిన సంగతిని సజ్జల ఈ సందర్బంగా గుర్తు చేశారు. 80 వేల క్యూసెక్కులైనా సరే రాయలసీమ కోసం తీసుకోవచ్చని కేసీఆర్ చెప్పారన్నారు. 


కృష్ణానదిలో తమకు అంటే ఏపీకు కేటాయించిన నీటినే తీసుకుంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నీటీ వినియోగంపై కేంద్రం నుంచి మానిటరింగ్ టీమ్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. నీటి సమస్య పరిష్కరించేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) తెలిపారు.


Also read: Mansas Lands Issue: మాన్సాస్ భూముల వ్యవహారంలో ఆరు కమిటీలతో విచారణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook