AP CM YS Jagan: సతీమణితో కలిసి కోవిడ్-19 టీకా తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
AP CM YS Jagan Receives COVID-19 Vaccine: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా టీకా వేయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి వైఎస్ భారతి కోవిడ్-19 టీకా తీసుకున్నారు.
AP CM YS Jagan Receives COVID-19 Vaccine: దేశ వ్యాప్తంగా నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మరోవైపు పలు రాష్ట్రాలలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా టీకా వేయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి వైఎస్ భారతి కోవిడ్-19 టీకా తీసుకున్నారు.
గుంటూరులోని భారత్‌పేట 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్ భారతితో కలిసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యాక్సిన్ తీసుకోనున్న నేపథ్యంలో కరోనా టీకాల పంపిణీ కేంద్రం, రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్ రూమ్, పరిశీలన గదులను అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ వైఎస్ భారతితో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) కోవిడ్-19 టీకా తీసుకున్నారు. అంతకుముందు పల్స్, ఆక్సిజన్ స్థాయిలను అధికారులు చెక్ చేశారు. ఏపీలో కరోనా టీకాల పంపిణీ వేగవంతం చేయాలని సైతం అధికారులను సీఎం ఆదేశించారు.
Also Read: Gold Price Today 01 April 2021: గుడ్ న్యూస్, మళ్లీ పతనమైన బంగారం ధరలు, వెండి ధరలు
అనంతరం 45 ఏళ్ల దాటినవారికి వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కోవిన్ యాప్, వెబ్‌సైట్ ద్వారా అర్హులైన వారందరూ కరోనా టీకాల కోసం రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కరోనా టీకాలు తీసుకుని ఏపీ ప్రజలలో కోవిడ్-19 వ్యాక్సిన్ల(COVID-19 Vaccine)పై ఉన్న అపోహలు తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీకి కొత్తగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: SBI Alert: ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్, నేడు ఈ సేవలకు అంతరాయం
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు ముగియడంతో ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook