Ys jagan Review: వేసవి విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమవుతోంది. వేసవిలో  విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పనితీరుపై తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష( Ap cm ys jagan) నిర్వహించారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు 2 వందల యూనిటర్ల ఉచిత విద్యుత్‌‌పై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. ఈ పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధుల్ని సకాలంలో విడుదల చేయాలని కోరారు. మరోవైపు కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్ యునిట్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. యుూనిట్ల నిర్మాణం దీర్ఘకాలం కొనసాగితే అవి భారంగా మారతాయన్నారు. వెంటనే నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తే ప్రయోజనం కలుగుతుందని అధికారులకు జగన్ వివరించారు. 


ముఖ్యంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విద్యుత్ కొరత (Power shortage) లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. రానున్న 3-4 నెలల్లో అవసరాలకు అనుగుణంగా ఎంతమేరకు విద్యుత్ అవసరమో..ఆ మేరకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జెన్ కో (Genco) ఆధ్వర్యాన నడుస్తున్న 15 యూనిట్లకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్షిస్తూ అవసరమైనమేరకు సమకూర్చుకోవాలన్నారు. 


Also read: Ap Government: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి జగన్ సూచనలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook