Ys jagan Sankranthi Wishes: తెలుగు ప్రజల పెద్ద పండుగ వచ్చేస్తోంది. మూడ్రోజుల పాటు జరుపుకున్న సంక్రాంతి సందడి ప్రారంభమైంది. అశేష తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు లోగిళ్లు కళకళలాడుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పండుగ అంటే సంక్రాంతినే. సూర్యుడి మకరరాశిలో ప్రవేశించిన సందర్బంగా చేసుకునే అతి ముఖ్యమైన పండుగ. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈ పండుగ శోభ సరికొత్తగా కన్పిస్తుంది. సంక్రాంతిని తెలుగుదనానికి ప్రతీకగా పిలుస్తారు. 


అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంతూర్లపై మమకారానికి, రైతులు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి..తెలుగువారికంటూ ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భోగిమంటలు రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందడి, పచ్చని పంట పొలాల కళకళలు అన్నీ కలిపి పల్లెల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని వైఎస్ జగన్ (Ap cm ys jagan)చెప్పారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని కోరారు. 


Also read:Pandem Kollu: సంక్రాంతికి సిద్ధమైన పందెం కోళ్లు..ఒక్కొక్కటి లక్ష వరకూ ధర


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook