ఏపీ రాజధాని అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కానుందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ మూడు రాజధానుల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి రాజధాని విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం త్వరలో ఏపీ రాజధాని కానుందని..తాను కూడా అక్కడికి షిఫ్ట్ అయి పరిపాలన కొనసాగిస్తానని చెప్పడం ఒక్కసారిగా సంచలనమైంది. సర్వత్రా ఇప్పుడీ అంశం చర్చకు దారితీస్తోంది. మార్చ్ నెలలో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సుకు సంబంధించి సన్నాహక సమావేశం ఇవాళ ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించిన జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 


రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల స్థాపనకై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ విధమైన సహకారం అందించేందుకైనా సిద్ధమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టేందుకు మీ సహకారం అవసరమని జగన్ చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోదీకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్ 1 స్థానంలో ఉంటోందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితుల్ని ఇన్వెస్టర్లకు వివరించారు. 


పారిశ్రామికవేత్తలిచ్చిన ఫీడ్‌బ్యాక్ కారణంగానే తాము నెంబర్ వన్‌గా ఉన్నామని చెప్పారు. ఏపీకు సుదీర్ఘ తీరప్రాంతముందని..11.43 శాతం వృద్ధిరేటుతో దేశంలో వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో 3 ఏపీకు దక్కడం శుభపరిణామమని..సింగిల్ డెస్క్ వ్యవస్థ ద్వారా కేవలం 21 రోజుల్లో అన్ని అనుమతులిస్తున్నామన్నారు.


ఇక చివరిగా కీలకాంశాల్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రి జగన్. రానున్న రోజుల్లో విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారనుందని..తాను కూడా అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. విశాఖ రాజధానిలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 


Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook