YCP First List: 2024 ఎన్నికలకు ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమౌతోంది. గెలుపు గుర్రాల్ని సిద్ధం చేసి ముందుగా ప్రకటించడం ద్వారా వైసీపీ నేతలు, శ్రేణుల్లో గందరగోళం దూరం చేయాలనేది పార్టీ ఆలోచనగా ఉంది. మూడు విడతలుగా అభ్యర్దుల జాబితా విడుదల చేయనుంది. తొలి జాబితా దసరా నాటికి విడుదల కావచ్చని అంతర్గత సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 ఎన్నికల్లో వైనాట్ 175 లక్ష్యం పెట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా నేతలు, కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పట్నించే అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించేశారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్ధుల ఎంపిక జరుగుతోంది. మొత్తం మూడు విడతలుగా అభ్యర్ధుల జాబితా విడుదల చేయాలని పార్టీ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలి జాబితాను దసరా నాటికి విడుదల చేయవచ్చు. 


ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గన్నవరం నుంచి వల్లభనేని వంశి, చీరాల నుంచి కరణం వెంకటేశ్, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్, వెంకటగిరి నుంచి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వాసుపల్లి గణేశ్. మద్దాల గిరి పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన 7 సర్వేల ఆధారంగా సిట్టింగులకు లేదా కొత్తవారికి అవకాశమనేది ఇవ్వనున్నారు. ఈ విషయంపై వైఎస్ జగన్‌దే తుది నిర్ణయం కానుంది. అదే సమయంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కూడా లెక్కలోకి తీసుకోనున్నారు. 


2024 సాధారణ ఎన్నికలకు తెలుగుదేశం-జనసేన పొత్తు ఖాయమైన నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో వివిధ సమీకరణాలను అధ్యయనం చేసి అభ్యర్ధుల్ని ఎంపిక చేయనున్నారు. తొలి దశ జాబితాలో 27 మంది కొత్తవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. అభ్యర్ధుల్ని ముందుగా ప్రకటించడం ద్వారా నియోజకవర్గంలో ఎదురయ్యే వివిద రకాల సమస్యల్ని అధిగమించవచ్చని పార్టీ వ్యూహంగా ఉంది. అదే సమయంలో వారసుల్ని రంగంలో దించాలని ఆలోచిస్తున్నవారికి జగన్ షాక్ ఇవ్వనున్నారు. ఈసారి కూడా సీనియర్లనే రంగంలో దించాలనేది జగన్ ఆలోచనగా ఉంది. పోటీ చేయలేని పరిస్థితులుంటే మాత్రం మినహాయింపు ఇస్తారు.


2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ పార్టీ కో ఆర్డినేటర్లుగా పనిచేసినవారిలో కొందరికి అభ్యర్ధిత్వం ఖరారు చేయనున్నారు. అదే సమయంలో పార్టీపై తిరుగుబాటు చేసి దూరమైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గాల్లో ఇతరులకు తొలి జాబితాలోనే టికెట్లు ఇవ్వనున్నారు. ఈసారి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో వైఎస్ జగన్ మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దసరా నాటికి తొలి జాబితా విడుదల చేసి..సంక్రాంతి తురవాత తుది జాబితా విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. 


Also read: Chandrayaan 3 Updates: చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ ఇక లాంఛనమే, జాబిల్లికి 25 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook