Ap Government: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. స్టీల్‌ప్లాంట్ అంశంపై ప్రధానికి జగన్ మరోసారి లేఖ రాసి..పునరుద్ధరణకు సూచనలు చేసినట్టు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag steel plant privatisation) అంశంపై నిన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఆందోళనను ఉధృతమైంది. మరోవైపు కేంద్ర మంత్రి చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ప్రారంభించాయి. ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) మాట్లాడారు. కేంద్ర మంత్రి ప్రకటనను కొన్ని పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయాలు చేస్తున్నాని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ అంశంపై ముఖ్యమంత్రి జగన్ (Ap cm ys jagan) మరోసారి ప్రధాని మోదీకు లేఖ రాసినట్టు చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారన్నారు. అఖిలపక్షాన్ని, కార్మిక సంఘ నేతల్ని ప్రదాని వద్దకు తీసుకెళ్తానని లేఖలో రాసినట్టు చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ కేంద్ర పరిధిలోని అంశమని..నూటికి నూరుశాతం కేంద్ర ప్రభుత్వం (Central government) ఆధీనంలో ఉన్న పరిశ్రమ అని వెల్లడించారు. 


స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు కూడా చేశారన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ (Vizag steel plant) ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ పరంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, అతని ఎల్లోమీడియా వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేసేలా కథనాలు ప్రసారం చేశారని ధ్వజమెత్తారు. 


Also read: Vizag steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై ప్రధాని అప్పాయింట్‌మెంట్ కోరిన వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook