Ysr Aarogyasri: ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ కీలక నిర్ణయం, పరిమితి 25 లక్షలకు పెంపు
Ysr Aarogyasri ఆరోగ్య శ్రీ పథకంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య శ్రీ పరిమితి, పరిధిని భారీగా పెంచారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ysr Aarogyasri పేదలకు ఉచితంగా ఆధునిక వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకంపై ఏపీ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి మార్గదర్శకాలు ఈ నెల 18న వెల్లడి కానున్నాయి.
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పధకం ఇక మరింత ప్రయోజనంగా మారనుంది. ఏపీలో ఇప్పటి వరకూ ఆరోగ్య శ్రీ కార్డుపై 5-10 లక్షల వరకూ వైద్య ఖర్చులకు ఆస్కారముండేది. ఇప్పుడీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని దేశంలో ఎక్కడా లేనివిధంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి రాష్ట్రంలోని 1.42 కోట్ల కార్డు హోల్డర్లకు కొత్తగా కార్డులు జారీ చేయనున్నారు. ఆరోగ్య శ్రీ పరిమితి పెంపుకు సంబంధించిన మార్గదర్శకాలను ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 18న వెల్లడించనున్నారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది, గృహ సారధులు, వాలంటీర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ప్రమాదకరమైన, ప్రాణాంతక కేన్సర్ వ్యాధికి ఆరోగ్య శ్రీలో గతంలో 5 లక్షల పరిమితి ఉంటే ఇప్పుడా పరిమితిని పూర్తి తొలగించారు. 2019 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకూ ఆరోగ్య శ్రీ పధకంలో 37 లక్షలమందికి ఉచిత వైద్య సేవలు అందాయి. ప్రభుత్వం భరించిన ఖర్చు 11,859 కోట్లుగా ఉంది.
ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పధకంలో కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ, కార్డియాలజీ, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ, డెర్మటాలజీ, ఎడోక్రినాలజీ, ఈఎన్టీ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, జెనిటో యూరినరీ చికిత్స, గైనకాలజీ, ప్రసూతి శస్త్ర చికిత్స, మెడికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీయ న్యూరో సర్జరీ, ఆప్తమాలజీ సర్జరీ, ఆర్గాన్ ట్రాన్ ప్లాంటేషన్ సర్జరీ, ఆర్దోపెడిక్ సర్జరీ, విధానాలు, పీడియాట్రిక్ సర్జరీ, పిడియాట్రిక్స్,, చర్మ శస్త్ర చికిత్స, పాలీ ట్రామా, మనోరోగ చికిత్స, పల్మోనాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, రుమటాలజీ, సర్జికల్ ఆంకాలజీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
Also read: Cyclone Alert: బంగాళాఖాతంలో మరో భారీ తుపాను, ఏపీ తీరంవైపుకు దూసుకొచ్చే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook