Oxygen Plants: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అంటేనే ఓ విధమైన భయం ఏర్పడుతుంది. అంతలా దేశాన్ని విలవిల్లాడించిన పరిస్థితి. అప్పుడు నెలకొన్న ఆక్సిజన్ కొరత థర్డ్‌వేవ్‌లో లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఆక్సిజన్. ఆక్సిజన్ లభించక చాలామంది ప్రాణాలు కోల్పోయిన దుస్థితి. ఇప్పుడు కోవిడ్ థర్డ్‌వేవ్ దేశాన్ని తాకింది. రోజుకు లక్షన్నర కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ నాటి పరిస్థితులు తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap government) సంసిద్ధమైంది. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రాణ వాయువు లేకుండా ఉండేలా జగనన్న ప్రాణవాయువు కార్యక్రమం ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.


గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసే పీఎస్ఏ ప్లాంట్లు (Oxygen plants)ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 124 ఆసుపత్రుల్లో 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనుంది. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 144 ప్లాంట్లను ప్రారంభించననున్నారు. 189 కోట్లతో ఈ ప్లాంట్లను నిర్మించారు. ఈ ప్రాంట్ల ద్వారా నిమిషానికి 5 వందల నుంచి వేయి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. మొత్తం అన్ని ప్లాంట్ల నుంచి నిమిషానికి 93 వేల 6 వందల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కానుంది. రాష్ట్రంలో 24 వేల 419 బెడ్స్‌కు ఆక్సిజన్ పైప్‌లైన్స్ ఏర్పాటయ్యాయి. 35 ఆసుపత్రుల్లో 399 కిలోలీటర్ల సామర్ధ్యంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లు ఏర్పాటయ్యాయి. 39 ఆసుపత్రులకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లు కొనుగోలు చేయనుంది ప్రభుత్వం. ఆక్సిజన్ సరఫరా నిమిత్తం 20 కిలోలీటర్ల సామర్ధ్యం కలిగిన 25 కంటైనర్లను కొనుగోలు చేశారు. 


కరోనా థర్డ్‌వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ప్రజలకు మెరుగైన వైద్యం అధించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేశారు. కరోనా చికిత్సకు అవసరమైన పీఎస్ఏ ప్లాంట్లను వైఎస్ జగన్ (Ap cm ys jagan) ప్రారంభించనున్నారు.


Also read : AP Corona update: ఏపీలో పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 1,257మందికి పాజిటివ్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook