అమరావతి : AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపటి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ( Amit Shah ) పాటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను ( Gajendra Singh Shekhawat ) సీఎం జగన్‌ కలవనున్నారని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్‌ ( Coronavirus ) వ్యాప్తి ఏ స్థాయిలో ఉంది ? లాక్ డౌన్ అమలు తీరు, లాక్ డౌన్ సడలింపుల ( Lockdown 5.0 ) అనంతరం కరోనా పాజిటివ్ కేసుల నమోదు, కరోనావైరస్ పాజిటివ్ కేసులను గుర్తించడం కోసం భారీ సంఖ్యలో చేపట్టిన కోవిడ్-19 టెస్టులు ( COVID-19 tests), కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాల గురించి అమిత్‌ షాకు వైఎస్ జగన్ వివరించనున్నారు. అంతేకాకుండా విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం ఘటన ( Vizag gas leak tragedy ) సైతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో బాధితులకు ఏపీ సర్కార్ అండగా నిలిచిన తీరును సైతం ఈ సమావేశంలో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. అలాగే లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను సైతం కేంద్రం దృష్టికి తీసుకురావడం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని కోరనున్నారని సమాచారం. ( తెలంగాణ సర్కారుకి గోదావరి, క్రిష్ణా రివర్ బోర్డులు షాక్ )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం వైఎస్ జగన్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను కూడా సీఎం కలిసే అవకాశం ఉంది ( AP CM YS Jagan to meet Gajendra Singh Shekhawat ). ఇటీవల తెలంగాణ, ఏపీ మధ్య నీటి వనరుల వినియోగం విషయంలో స్వల్ప విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని సమస్యకు ఓ పరిష్కారం కనుగొనాల్సిందిగా ఏపీ సర్కార్ ( AP govt ) కోరినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. Locusts attacks: మిడతల దండు దాడి నుంచి తెలంగాణ సేఫ్ )


గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టుకు ( Kaleshwaram project ) అనుసంధానంగా కొత్తగా ఏ నిర్మాణాలు చేపట్టరాదని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB ) ఇటీవల తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి ఓ లేఖ రాసింది. ఏపీ సర్కార్ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని.. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకే తాము ఈ లేఖ రాస్తున్నామని గోదావరి నది మేనేజ్‌మెంట్ బోర్డు ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. అక్కడ కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌ని కలవనున్నారనే వార్తలకు ప్రాధాన్యత చేకూరింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..