Jagananna Vidya Deevena: ఏపీ ప్రజలకు శుభవార్త. జగనన్న అమ్మఒడి పథకం డబ్బులు ఇవాళ జమ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షలమంది తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా నగదు విడుదల కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రియ పధకమైన అమ్మఒడి నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు నేరుగా జమ కానుంది. 2021 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 10 లక్షల 82 వేలమంది విద్యార్ధులకు 709 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద అందించనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద..ప్రతి త్రైమాసికానికి ఫీజులు చెల్లిస్తోంది ప్రభుత్వం. మరోవైపు బడ్జెట్‌లో పాఠశాల విద్య నిమిత్తం గత ఏడాది కంటే 12.52 శాతం ఎక్కువగా..22 వేల 706 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. 


పిల్లల్ని చదివించేందుకు తల్లులకు ఆర్ధికపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల 48 వేల 865 మంది తల్లుల ఖాతాల్లో నేరుగా ఏడాదికి 15 వేల రూపాయలు జమ అవుతున్నాయి. ఫలితంగా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న దాదాపు 84 లక్షలమంది విద్యార్ధులకు లబ్ది చేకూరుతోంది. మరోవైపు జగనన్న విద్యాదీవెనలో భాగంగా పిల్లలకు అందిస్తున్న కిట్‌లలో 3 జతల స్కూల్ యూనిఫాం, కుట్టు ఛార్జీలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ సెట్, ఓ జత బూట్లు, 2 జతలు సాక్స్, 1 స్కూల్ బ్యాగ్, 1 బెల్ట్, 3 మాస్కులు అందిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన పధకం కింద దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదవిద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో చదివే విద్యార్ధులకు పూర్తిగా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తోంది.


Also read: AP Assembly Elections 2024: ఆ 50 మందికి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ లేనట్టేనా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook