ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నూతన పధకానికి శ్రీకారం చుట్టనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కీలక సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీ అంశాలపై అధికార్లతో సమీక్షించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఛీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ( Ap cs Adityanath das ) , వ్యవసాయ శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు సమీక్షకు హాజరయ్యారు. సమీక్షలో పలు కీలకాంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.


ధాన్యం సేకరించిన 15 రోజుల్లో పేమెంట్ జరిగేట్టు చూడాలని అధికార్లను ఆదేశించారు. ఇప్పటివరకూ సేకరించిన ధాన్యానికి సంక్రాంతి ( Sankranthi ) నాటికి రైతుల బకాయిల్ని చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణ బిల్లులు పెండింగ్ లో ఉండకూడదని..ఖరీఫ్ నిర్ణీత లక్ష్యం ప్రకారం ధాన్యం సేకరణ జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు కీలకమైన ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ  ( Door to Door Ration Delivery ) కోసం సిద్ధమైన ప్రత్యేక వాహనాల్ని ఈ నెల 3వ వారంలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదే సందర్బంలో 10 కిలోల రైస్ బ్యాగ్స్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు.


ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటి నుంచే నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. దీనికోసం 9 వేల 260 మొబైల్ యూనిట్లు, మోడర్న్ వేయింగ్ మిషన్స్ సిద్ధం చేశారు. పంపిణీ కోసం 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు సిద్ధం చేశారు. ఈ ప్రత్యేక వాహనాల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు కేటాయించనున్నారు. ఇందులో 2 వేల 333 వాహనాల్ని ఎస్సీలకు, 7 వందల వాహనాల్ని ఎస్టీలకు, 3 వేల 875 వాహనాల్ని బీసీలకు, 1616 వాహనాల్ని ఈబీసీలకు,  567 వాహనాల్ని ముస్లింలకు, 85 వాహనాల్ని క్రైస్తవ మైనార్టీలకు కేటాయించనున్నారు. వాహన లబ్దిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం లభించనుండగా..పది శాతం లబ్దిదారుడి వాటా అని ప్రభుత్వం పేర్కొంది.


Also read: AP Jobs 2021: కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు.. చివరి తేదీ జనవరి 8