అమరావతి: రంజాన్ మాసం (Ramzan month) సమీపిస్తోంది. ఏప్రిల్ 23, గురువారం నాడు ప్రారంభం కానున్న రంజాన్ పవిత్ర మాసం మే 23, శనివారం నాడు ముగియనుంది. రంజాన్ మాసంలో (Ramadan month) సంప్రదాయం ప్రకారం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరపడం ఒక ఆనవాయితీ. అయితే, కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం లాక్ డౌన్‌తో (Lockdown) పాటు సామాజిక దూరం (Social distancing) పాటిస్తున్నందున ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ముస్లిం మత పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్‌. రంజాన్ మాసంలో ప్రార్థనల కోసం మసీదులకు వెళ్లకుండా ఎవరికి వారు తమ ఇళ్లల్లోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని  ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు


ముస్లిం మత పెద్దలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇలా చెప్పాల్సి రావడం బాధాకరమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అందరి శ్రేయస్సు కోసం చెప్పక తప్పడం లేదన్నారు. సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది కనుక ఈ విషయాన్ని ముస్లిం సోదరులు అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలని సీఎం జగన్ ముస్లిం మత పెద్దలను కోరారు.


Also read : Telangana: లాక్‌డౌన్ తీవ్రతరం.. రేపటి నుంచి కఠినమైన ఆంక్షలు


ఏపీ సీఎం విజ్ఞప్తిపై స్పందించిన ముస్లిం మత పెద్దలు..
ఏపీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముస్లిం మత పెద్దలు.. ప్రభుత్వం చెప్పినట్టుగానే మసీదులకు వెళ్లకుండా ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తామని అన్నారు. లాక్ డౌన్ పాటించేందుకు సహకరిస్తామని సర్కార్‌కి మాట ఇచ్చిన ముస్లిం మత పెద్దలు.. ఏపీలో కరోనా నియంత్రణకు సీఎం తీసుకున్న చర్యలు, మర్కజ్ వివాదంపై ఆయన స్పందించిన తీరును ప్రశంసించారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ముస్లింలపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో ఇబ్బందికరమైన పోస్టులు పెట్టడం చేస్తున్నారని ముస్లిం మత పెద్దలు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 


Also read : ఏపీకి రూ.1,892.64 కోట్లు, తెలంగాణకు 982 కోట్లు


ముస్లిం మత పెద్దల ఫిర్యాదుపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ముస్లింలను అవమానించేలా వ్యాఖ్యలు చేసే వారిని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ని ఆదేశించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..