న్యూ ఢిల్లీ: ఏప్రిల్ నెల పన్నుల్లో భాగంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 46వేల 38 కోట్లు రూపాయలు విడుదల చేయగా అందులో తెలంగాణకు రూ. 982 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌కి రూ.1,892.64 కోట్ల రూపాయలు లభించాయి. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల వివరాలకు సంబంధించిన జాబితాను ట్విటర్ ఖాతా ద్వారా విడుదల చేసింది.
Also read : BMW India CEO రుద్రతేజ్ సింగ్ కన్నుమూత
కేంద్రం విడుదల చేసిన ఈ నిధులలో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి రూ. 8,255.19 కోట్లు నిధులు ఇవ్వగా, అత్యల్పంగా గోవాకు రూ. 177.72 కోట్లు మంజూరు అయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ తర్వాత అత్యధికంగా బీహార్‌కి రూ. 4,631 కోట్లు విడుదల కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రూ 3,630 కోట్లు, మహరాష్టకు 2,824 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..