విజయవాడ: ఏపీలో ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకోర్సులు అభ్యసించే నిరుపేద విద్యార్ధులకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన సీఎం జగన్.. విద్యార్థుల హాస్టల్ ఖర్చుల కోసం ప్రతీ ఏడాది రూ.20,000 అందిస్తామని ప్రకటించారు. పేద విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం ముష్టి వేసినట్లుగా చేసిందనీ ఆరోపించిన జగన్.. చాలీ చాలని ఫీజుల కారణంగా కొంతమంది నిరుపేద విద్యార్దులు చదువులు కూడా మానేశారని అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 


గత ప్రభుత్వం హయాంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేసిన విద్యార్ధులంతా తిరిగి చదువుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.