Ys Sharmila on Jagan: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు తీవ్రమౌతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న షర్మిల తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను గద్దె దించి తీరుతానని శపధం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల సోదరుడికి వ్యతిరేకంగా గళం పెంచుతోంది. ఇప్పటివరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల రానున్న ఎన్నికల్లో జగన్‌ను గద్దె దించడం ఖాయమని శపధం చేశారు. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల రోడ్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల చాలా నష్టపోయామని, ఆ హోదా వచ్చుంటే ఎన్నో వేల ఉద్యోగుల వచ్చుండేవన్నారు. జగన్ ఓ నియంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించానని..ఇక్కడ ఏపీలో కూడా నియంత ప్రభుత్వాన్ని దించుతానన్నారు. ఒక్క అవకాశం కోసం అడిగి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక హోదా ఉద్యమం  చేయలేదని విమర్శించారు 


వైఎస్ రాజశేఖర్ రెడ్డికి , ముఖ్యమంత్రి జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని అలవోకగా చెప్పలేదు. ఏకంగా 12 సార్లు వైఎస్ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తే..ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం దండగ అన్పిస్తోందన్నారు. రాష్ట్రంలో అప్పుల్లేని రైతు ఒక్కడూ లేడన్నారు. విద్యార్ధులకైతే ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా రావడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం తప్ప మరేదీ కన్పించడం లేదని మండిపడ్డారు. ఇలాంటి పాలకుల్ని గద్దె దించాల్సిన అవసరముందన్నారు. 


Also read: AP Elections 2024: పొత్తు ఖాయమేనా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో ఎవరికెన్ని సీట్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook