AP Corona Bulletin Today: ఏపీలో మరోసారి తగ్గిన కరోనా కేసులు.. ఎంతమంది మరణించారంటే?
AP Corona Bulletin Today: ఏపీలో రోజువారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,605 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా ధాటికి మరో 10 మరణించారు. మరోవైపు రాష్ట్రంలో మరో 11,729 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
AP Corona Bulletin Today: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య మరోసారి స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 30,578 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,605 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్ ధాటికి రాష్ట్రంలో మరో 10 మంది మృతి చెందారు.
మరోవైపు మరో 11,729 మంది కొవిడ్ బాధితులు వైరస్ నుంచి విముక్తి పొందారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 93,488 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో 10 మంది మరణించారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో ఇద్దరిద్దరూ మరణించగా.. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలలో ఒక్కొక్కరు మృతి చెందారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 22,93,171 కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా నుంచి 21,85,042 మంది కోలుకున్నారు. కొవిడ్ మహమ్మారి ధాటికి రాష్ట్రంలో 14,641 మంది మృతి చెందారు.
జిల్లాల వారీగా కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 642 కరోనా కేసులు నమోదవ్వగా.. పశ్చిమ గోదావరి 539, గుంటూరు 524, నెల్లూరు 501, కృష్ణా 477, కడప జిల్లాలో 413 కరోనా కేసులు వెలుగు చూశాయి.
Also Read: APSRTC: శ్రీవారి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ఆఫర్.. ఇవాళ్టి నుంచి అమలులోకి..
Also Read: AP Corona Cases Today: ఆంధ్రప్రదేశ్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన కొవిడ్ మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook