ఏపీ ( Ap ) లో కరోనా వైరస్ ( Corona virus ) విజృంభణ ఇంకా కొనసాగుతోంది. వరుసగా మూడోరోజు కూడా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అటు పరీక్షల సంఖ్య కూడా పెరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో ఇటు కరోనా నిర్ధారణ పరీక్షల ( Covid tests ) సంఖ్య..అటు కేసుల సంఖ్య రెండూ పెరుగుతున్నాయి. రోజుకు సరాసరిన 50 వేల పరీక్షలు చేస్తున్న నేపధ్యంలో గత 24 గంటల్లో ఏకంగా 61 వేల 331 పరీక్షలు నిర్వహించారు. దీనికి తగ్గట్టుగానే కొత్త కేసులు కూడా 10 వేల 526 నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 35 లక్షల 41 వేల 321 పరీక్షలు నిర్వహించగా...కేసుల సంఖ్య 4 లక్షల 721కు చేరుకుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 3 లక్షల 3 వేల 711 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా...96 వేల 191 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 81 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా..గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 8 వేల 463 ఉంది. రాష్ట్రంలో కరోనా కేసుల ( Corona cases ) సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం..మొత్తం కేసుల సంఖ్య. 4 లక్షల మార్క్ ను ( Crossed 4 lakh mark ) దాటడం ఆందోళన కల్గిస్తోంది. అయితే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా అత్యధిక పరీక్షలు చేస్తున్న కారణంగానే కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. Also read: వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు