AP Covid Update: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నెమ్మది నెమ్మదిగా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో నమోదైన కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ సెకండ్ వేవ్(Corona Second Wave)ధాటికి దేశం అల్లకల్లోలమవుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య మూడ్రోజుల్నించి కాస్త తగ్గినా..కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి విషమంగా మారుతోంది. రోజుకు 20-21 వేల కేసులు నమోదవుతుండేవి. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్య భారీగా పెరిగింది. గత 24 గంటల్లో ఏకంగా 24 వేల 171 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 94 వేల 550 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ఒక్కసారిగా కేసుల సంఖ్య (Ap Corona Update)భారీగా పెరగడం ఆందోళన కల్గిస్తోంది.


ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14  లక్షల 35 వేల 491 మందికి వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 101 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 9 వేల 372కు చేరుకుంది. గత 24 గంటల్లో 21 వేలమంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 12 లక్షల 15 వేల మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 2 లక్షల 10 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1 కోటి 79 లక్షల 75 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. 


Also read: Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొనసాగుతున్న ఆక్సిజన్ సరఫరా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook