AP Corona Update: ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి, పెరిగిన రికవరీ రేటు
AP Corona Update: కరోనా సంక్రమణ నుంచి ఆంధ్రప్రదేశ్ కాస్త ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా నిలకడగా ఉన్న ఏపీ కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కన్పించింది. అటు మరణాల సంఖ్య మాత్రం అలానే కొనసాగుతోంది.
AP Corona Update: కరోనా సంక్రమణ నుంచి ఆంధ్రప్రదేశ్ కాస్త ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా నిలకడగా ఉన్న ఏపీ కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కన్పించింది. అటు మరణాల సంఖ్య మాత్రం అలానే కొనసాగుతోంది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి దేశమంతా అల్లకల్లోలమవుతోంది. కరోనా విపత్కర పరిస్థితులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కట్టడికై ఏపీలో అమలు చేస్తున్న రోజుకు 18 గంటల కర్ఫ్యూ సత్ఫలితాలనిస్తోంది. ఏపీ కరోనా కేసుల సంఖ్యలో కన్పించిన తగ్గుదల ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 91 వేల 629 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) నిర్వహించగా..18 వేల 767 మందికి పాజిటివ్‌గా తేలింది. అటు అదే 24 గంటల్లో 20 వేల 109 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 15 లక్షల 80 వేల 827 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో గత 24 గంటల్లో 104 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల 9 వేల 237 యాక్టివ్ కేసులున్నాయి.
కరోనా మహమ్మారి(Corona pandemic) కారణంగా చిత్తూరులో అత్యధికంగా 15 మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, విజయనగరంలో 11, విశాఖపట్నంలో 9, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగులు, కడపలో ముగ్గురు మరణించారు.
Also read: Krishnapatnam Corona Medicine: ప్రభుత్వ అనుమతి వచ్చాక..తిరిగి మందు పంపిణీ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook